ఎర్రచందనం రైతులకు 3 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:23 AM
దేశంలో సమగ్ర జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులకు.....
న్యూఢిల్లీ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): దేశంలో సమగ్ర జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోని జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ(ఎన్‌బీఏ) ఆర్థిక సాయం విడుదల చేసింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు చెందిన 198 మంది రైతులు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కలిపి రూ.3 కోట్లు పంపిణీ చేయనుంది. వారు సరఫరా చేసిన కలప పరిమాణం ఆధారంగా ఒక్కొక్కరు రూ.33 వేల నుంచి రూ.22 లక్షల వరకు అందుకోనున్నారు. వీరు చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఎర్రచందనం రైతులు.