Donation to TTD: టీటీడీకి రూ.1.10 కోట్ల విరాళం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:24 AM
టీటీడీ ట్రస్టులకు మంగళవారం రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన కాప్ష్టన్..
తిరుమల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టులకు మంగళవారం రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన కాప్ష్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ విరాళం చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో రూ.కోటి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.10 లక్షలు ఎస్వీ గోసంరక్షణకు వినియోగించాలని దాత కోరారు.