పట్టాభి ప్రాణాలు తీసేందుకు వైసీపీ స్కెచ్..

ABN, Publish Date - Oct 27 , 2024 | 02:13 PM

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం పెద్దఎత్తున కలకలం సృష్టించింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అమరావతి: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో ప్రజలు చిత్రవధకు గురైన సంగతి తెలిసిందే. ప్రజలను ఎన్ని రకాలుగా బాధపెట్టాలో అన్ని రకాలుగా జగన్ సర్కార్ బాధపెట్టింది. ప్రతిపక్షాలను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు జగన్. తన పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే కక్షసాధింపు చర్యలకు తెగబడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా పేట్రేగిపోయారు జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఇక అప్పట్లో ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం పెద్దఎత్తున కలకలం సృష్టించింది. అయితే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated at - Oct 27 , 2024 | 02:13 PM