వైసీపీ అధికార దుర్వినియోగం

ABN, Publish Date - Mar 26 , 2024 | 11:43 AM

తిరుపతి: ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బైపాస్ రోడ్డులోని పబ్లిక్ పార్కులో ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం కోసం పబ్లిక్ ప్రాపర్టీని వినియోగించకూడదు.

తిరుపతి: ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బైపాస్ రోడ్డులోని పబ్లిక్ పార్కులో ఎల్ఈడీ స్క్రీన్‌తో ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం కోసం పబ్లిక్ ప్రాపర్టీని వినియోగించకూడదు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, రాజకీయ ప్రకటనల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వంతెనలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలను వినియోగించకూడదు. అయితే వైసీపీ ఎన్నికల నిబంధనలను బే ఖాతరు చేస్తూ పబ్లిక్ పార్కులో వైసీపీ చేస్తున్న ప్రచారంపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు

Updated at - Mar 26 , 2024 | 11:43 AM