విశాఖ జిల్లాలో వైసీపీ భూ దందా..

ABN, Publish Date - Jan 08 , 2024 | 01:24 PM

విశాఖ జిల్లా: పందుర్తి మండలంలో వైసీపీ నాయకులు భూ దందాకు తెరలేపారు. చింతగట్ల పంచాయతీలో జగనన్న లే ఔట్ల పేరుతో వైసీపీ నాయకులు కొండ స్థలాలను లెవల్ చేసి ఆక్రమించుకుంటున్నారు.

విశాఖ జిల్లా: పందుర్తి మండలంలో వైసీపీ నాయకులు భూ దందాకు తెరలేపారు. చింతగట్ల పంచాయతీలో జగనన్న లే ఔట్ల పేరుతో వైసీపీ నాయకులు కొండ స్థలాలను లెవల్ చేసి ఆక్రమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ లే ఔట్లను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, టీడీపీ నాయకులు పరిశీలించారు. జగనన్న లే ఔట్లో 130 మందికి అనుమతి ఉండగా సుమారు 2 వందల వరకు డెవలప్ చేసి వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాత్రి, పగలు కొండ గ్రావెల్ తవ్వుతున్నా.. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 08 , 2024 | 01:24 PM