కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారిస్తారా?

ABN, Publish Date - Mar 22 , 2024 | 09:31 AM

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నిన్న రాత్రి అరెస్టు చేసింది. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన వారం రోజుల్లోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం విశేషం.

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నిన్న రాత్రి అరెస్టు చేసింది. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన వారం రోజుల్లోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం విశేషం. ఇక ఢిల్లీ మద్యం స్కామ్‌లో అరెస్టుల పర్వం కూడా క్లైమాక్స్‌కు చేరింది. ఈ కుంభకోణంలో రూ. వంద కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ స్కామ్‌లో పాత్రపై కేజ్రీవాల్, కవితను ఎదురెదురుగా కూర్చోబట్టి ప్రశ్నించనున్నట్లు సమాచారం. విచారణకు రావాలంటూ కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు 9సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన హాజరు కాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 22 , 2024 | 09:31 AM