సజ్జల కుటుంబానికి రెండుచోట్ల ఓట్లు..

ABN, Publish Date - Feb 14 , 2024 | 11:23 AM

అమరావతి: నిత్యం నీతులు వల్లవేసే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రంలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఆయన సతీమణి, కుమారుడు, కోడలు కూడా రెండు చోట్ల ఓటర్లుగా నమోదయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సజ్జల కుటుంబం రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారు.

అమరావతి: నిత్యం నీతులు వల్లవేసే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రంలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఆయన సతీమణి, కుమారుడు, కోడలకు కూడా రెండు చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సజ్జల కుటుంబం రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు, మంగళగిరిలో వారికి ఓట్లు ఉన్నాయి. సజ్జల సతీమణి లక్ష్మి, కుమారుడు భార్గవ, కోడలు నవ్య పొన్నూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం. 31లో సీరియల్ నెం. 799, 800, 801, 802లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 14 , 2024 | 11:24 AM