వారిద్దరు చెప్పిన విషయాలు పచ్చి అబద్ధాలు: విజయమ్మ

ABN, Publish Date - Oct 29 , 2024 | 07:09 PM

వైస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలన్నీ అసత్యాలేనని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానంగా పంచాలని ఆమె చెప్పారు.

అమరావతి: వైస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలన్నీ అసత్యాలేనని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానంగా పంచాలని ఆమె చెప్పారు. వైఎస్ ఆస్తుల్లో షర్మిలకు సమాన వాటా ఉందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. జగన్, షర్మిల పిల్లలకూ ఆస్తులు సమానంగా పంచాలని వైఎస్ ఆజ్ఞాపించారని లేఖలో ఆమె పేర్కొన్నారు. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన నిలబడడం తన విధి, ధర్మమని విజయమ్మ అన్నారు. ఇంట్లో ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని లేఖలో ఆమె తెలిపారు. వైసీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పిన ప్రతీ విషయం అబద్ధమని విజయమ్మ చెప్పారు.

Updated at - Oct 29 , 2024 | 07:10 PM