విడదల రజనిపై డేటా చోరీ ఆరోపణలు

ABN, Publish Date - Jan 09 , 2024 | 10:04 AM

అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజనీకు స్థాన చలనం కలిగించి గుంటూరు వెస్టు ఇన్చార్జిగా అధిష్టానం నియమించింది. కొత్త నియోజక వర్గంలో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజనీకు స్థాన చలనం కలిగించి.. గుంటూరు వెస్టు ఇన్చార్జిగా అధిష్టానం నియమించింది. కొత్త నియోజక వర్గంలో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా న్యూ ఇయర్ రోజు సరికొత్త ప్రయోగం చేశారు. 2 లక్షల మందికిపైగా ఫోన్లకు శుభాకాంక్షల సందేశాలు పంపారు. ఇప్పుడు అదే మంత్రి మెడకు చుట్టుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఇంతమందికి మెసేజ్‌లు ఎలా పంపారు? గతంలో సమాచారం చోరీ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమాచారాన్ని మంత్రి వాడుకున్నారా? అని ఓటర్లు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 09 , 2024 | 10:04 AM