తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ అరెస్ట్..

ABN, Publish Date - Dec 01 , 2024 | 02:16 PM

తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఫోర్జరీ సంతకాలతో పలువురి మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది.

హైదరాబాద్: తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఫోర్జరీ సంతకాలతో పలువురి మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాంతిదత్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. తన కంపెనీకి పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ కాంతిదత్ విస్తృత ప్రచారం చేశారు. మహిళా వ్యాపారవేత్త శ్రీజారెడ్డిని సైతం అతను బురిడీ కొట్టించారు. వ్యాపారంలో షేర్ అంటూ పరిణీతి చోప్రాకు సైతం నిందితుడు టోకరా పెట్టారు. శ్రీజా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్లు సమంత, కీర్తి సురేశ్, డిజైనర్ శిల్పారెడ్డి సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.100 కోట్ల మోసానికి కాంతిదత్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Updated at - Dec 01 , 2024 | 02:19 PM