దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా విశాఖ..

ABN, Publish Date - Nov 03 , 2024 | 09:41 PM

తూర్పు తీరానికి మణిహారం ఆంధ్రప్రదేశ్‌లోని సుందర నగరం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటు వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది.

విశాఖ: తూర్పు తీరానికి మణిహారం ఆంధ్రప్రదేశ్‌లోని సుందర నగరం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటు వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా సైనిక దళం, విశాఖలో తూర్పు నౌకాదళం ఉండేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో డిఫెన్స్ ఉన్న ఏకైక నగరం విశాఖ. అమెరికా, చైనాల త్రివిధ దళాలు కలిసి ఒకే చోట పని చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందు కోసం త్వరలో థియేటర్ లెవెల్ కమాండ్‌లను ఏర్పాటు చేయనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడూ ఒకే చోట ఉండి సమన్వయంతో పని చేస్తూ ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహిస్తాయి. అలాంటి థియేటర్ లెవెల్ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతోంది.

Updated at - Nov 03 , 2024 | 09:41 PM