కృష్ణ బోర్డు నియంత్రణలోకి శ్రీశైలం, సాగర్

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:19 AM

హైదరాబాద్: కృష్ణ బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను కృష్ణనది యాజమాన్యం బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి.

హైదరాబాద్: కృష్ణ బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను కృష్ణనది యాజమాన్యం బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. నిన్న (గురువారం) హైదరాబాద్‌ జలసౌధలో ఛైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ చీఫ్ మురళీధర్, అంతర్ రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సాగర్ చీఫ్ ఇంజనీర్ అంజనీ కుమార్, కృష్ణ బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ విజయకుమార్, ఏపీ నుంచి ఈఎన్‌సీసీ నారాయణ రెడ్డితోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 11:19 AM