తానా ఫౌండేషన్ స్కాం లో 30 కోట్లు నొక్కేసిన శ్రీకాంత్
ABN, Publish Date - Nov 26 , 2024 | 08:47 PM
అమెరికాలోని తానా ఫౌండేషన్‌లో నిధుల మళ్లింపు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంతకు మళ్లించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తానా సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండా.. అనుమతులు లేకుండా దాదాపు రూ. 30 కోట్ల నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయాన్ని ఆరా తీయ్యగా... నిధులు మళ్లింపు నిజమేనని.. అది తన సొంత నిర్ణయమంటూ ఆయన తానా ఫౌండేషన్ పెద్దల ముందు కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు.. దీనికి పూర్తి బాధ్యత సైతం వహిస్తానని ఈ మెయిల్ ద్వారా బోర్డు చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, శశికాంత్ మల్లేపల్లికి తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 26 , 2024 | 08:50 PM