భార్య వేధింపులు.. సాఫ్ట్‌వేర్ భర్త ఏం చేశారంటే..

ABN, Publish Date - Dec 10 , 2024 | 08:10 PM

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల అతుల్ సభాశ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశాడు. ఏఐ నిపుణిడిగా అతుల్‌కు మంచి పేరు ఉంది. కొంత కాలం నుంచి భార్యతో అతనికి గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో భర్త అతుల్ సుభాశ్‌పై భార్య ఏకంగా 9 కేసులు పెట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల అతుల్ సభాశ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశాడు. ఏఐ నిపుణిడిగా అతుల్‌కు మంచి పేరు ఉంది. కొంత కాలం నుంచి భార్యతో అతనికి గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో భర్త అతుల్ సుభాశ్‌పై భార్య ఏకంగా 9 కేసులు పెట్టింది. ఇందులో ఆరు కేసులు దిగువ కోర్టులో, మూడు కేసులు హైకోర్టులో నడిచాయి. ఇప్పటికీ కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. 2022లో అతుల్ సుభాశ్‌తోపాటు అతని తల్లిదండ్రి, సోదరుడిపై హత్య, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ కేసును ఆమె ఉపసంహరించుకుంది. ఇంకో కేసులో తన తండ్రి మరణానికి భర్తే కారణమని సుభాశ్ భార్య కేసు వేసింది. ఆ తర్వాత పెద్దమెుత్తంలో భర్త నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. అయితే ఆమె తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయారని తర్వాత తేలింది. ఇంతటితోనే సుభాశ్‌పై వేధింపులు ఆగలేదు. నెలకు రూ.2 లక్షల భరణం ఇవ్వాలని కూడా కేసు వేసింది. ఇలా కేసులు వేయడం, ఉప సంహరించకుంటూ అతుల్ సుభాశ్‌ను రకరకాలుగా వేధించింది. దీంతో అతను ఓ దారుణ నిర్ణయం తీసుకున్నారు.

Updated at - Dec 10 , 2024 | 08:16 PM