నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు
ABN, Publish Date - Mar 01 , 2024 | 08:45 AM
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా వైసీపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి.
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా వైసీపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహిధర్ రెడ్డి భేటీ అయ్యారు. కందుకూరు సిట్టింగ్ స్థానం నుంచి మహిధర్ రెడ్డిని వైసీపీ తొలగించింది. దాంతో టీడీపీలో చేరికపై మహిధర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. తనతోపాటు మహిధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకువెళ్లే యోచనలో వేమిరెడ్డి ఉన్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 01 , 2024 | 08:45 AM