ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర భేటీ..

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:09 AM

హైదరాబాద్: అందుబాటలో ఉన్న వైఎస్సార్‌టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చలు జరపనున్నట్లు సమాచారం.

హైదరాబాద్: అందుబాటలో ఉన్న వైఎస్సార్‌టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చలు జరపనున్నట్లు సమాచారం. అనంతరం పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కుటుంబసమేతంగా షర్మిల పులివెందులకు బయలుదేరనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ తొలి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 02 , 2024 | 11:09 AM