షర్మిల బస్సు యాత్ర నేటి నుంచి...

ABN, Publish Date - Apr 05 , 2024 | 10:21 AM

కడప జిల్లా: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర శుక్రవారం కడప జిల్లా, బద్వేల్ నుంచి ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో షర్మిల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

కడప జిల్లా: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర శుక్రవారం కడప జిల్లా, బద్వేల్ నుంచి ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో షర్మిల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బద్వేల్ నియోజకవర్గం, కాశినాయన మండలం, అమంగపల్లి నుంచి ఈ రోజు ఉదయం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రమంతా షర్మిల పర్యటించనున్నారు. ప్రచారంలో తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్యను అస్త్రంగా.. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్, జగన్‌లను టార్గెట్‌గా చేసి షర్మిల ప్రసంగిస్తారని జనంలో చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 05 , 2024 | 10:21 AM