IPL: ఐపీఎల్‌లో తెలుగు ఆటగాళ్ల హవా..

ABN, Publish Date - Nov 27 , 2024 | 02:13 PM

ఐపీఎల్ సీజన్-18లో తెలుగు కుర్రాళ్లు ఛాన్స్ కొట్టారు. ఇప్పటికే నలుగురు ఐపీఎల్‌కు ఎంపిక కాగా.. ఇప్పుడు మరో ముగ్గురు ఆ లిస్టులో చేరారు. ప్రతిభ ఉంటే మారుమూల ఉన్నా అవకాశం దక్కుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్-18లో తెలుగు కుర్రాళ్లు ఛాన్స్ కొట్టారు. ఇప్పటికే నలుగురు ఐపీఎల్‌కు ఎంపిక కాగా.. ఇప్పుడు మరో ముగ్గురు ఆ లిస్టులో చేరారు. ప్రతిభ ఉంటే మారుమూల ఉన్నా అవకాశం దక్కుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఐపీఎల్ ఇండియన్ ప్రిమియర్ లీగ్ క్రీడా ప్రేమికులకు పండగ. కేవలం 20 ఓవర్లలో భారీ సిక్సర్లతో ఆకట్టుకునే బ్యాట్ మెన్, అద్భుత క్యాచ్‌లు పట్టే ఫీల్డర్స్, కళ్లు చెదిరే వికెట్స్ తీసే బౌలర్లకు ఐపీఎల్ వేదికగా మారింది. ఇంతకుముందు రంజీ, ఇంటర్నేషనల్‌కు ఎంపిక కావాలంటే క్రీడాకారులకు తలకు మించిన భారంగా ఉండేది. ఐపీఎల్ రావడంతో యువ క్రీడాకారులకు అందివచ్చిన మంచి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న క్రికేటర్లకు ఐపీఎల్-18లో అవకాశం దక్కింది.

Updated at - Nov 27 , 2024 | 02:13 PM