వాలంటీర్ల వరుస ఆత్మహత్యలు..
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:50 PM
విజయనగరం జిల్లా: బొబ్బిలిలో వాలంటీర్ల వరుస ఆత్మహత్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు వాలంటీర్లు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.
విజయనగరం జిల్లా: బొబ్బిలిలో వాలంటీర్ల వరుస ఆత్మహత్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు వాలంటీర్లు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా కలకలం రేపుతోంది. ఈనెల 1వతేదీన 10వ వార్డు వాలంటీర్ కిలారు నాగరాజు బొబ్బిలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. 15వ వార్డు వాలంటీర్ రామకృష్ణ కూడా నిన్న (సోమవారం) బావిలో శవమై తేలాడు. మూడు రోజుల నుంచి అదృశ్యమైన రామకృష్ణ.. ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 26 , 2024 | 12:50 PM