తాకట్టులో సచివాలయం.. ఉలిక్కిపడిన సీఆర్డీయే

ABN, Publish Date - Mar 05 , 2024 | 10:33 AM

అమరావతి: అందినకాడికి అప్పులు.. అడ్డగోలుగా అప్పులు.. కేంద్రం అనుమతించిన మేరకు.. ఆపైన ఆర్బీఐ నుంచి అప్పులు. కార్పొరేషన్ల ద్వారా ఎడా పెడా అప్పులు.. అయినా రుణదాహం తీరడంలేదు.

అమరావతి: అందినకాడికి అప్పులు.. అడ్డగోలుగా అప్పులు.. కేంద్రం అనుమతించిన మేరకు.. ఆపైన ఆర్బీఐ నుంచి అప్పులు. కార్పొరేషన్ల ద్వారా ఎడా పెడా అప్పులు.. అయినా రుణదాహం తీరడంలేదు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా అప్పులు తెచ్చేందుకు తాకట్టు వ్యాపారం మొదలుపెట్టారు. ఎన్నికల తర్వాత ఏమౌతుందో? ఏమో? వాటమి పాలైతే.. అస్మదీయ కంపెనీల బిల్లులు ఆగిపోతాయేమో.. ఇదే ఆందోళనతో కనిపించిన భూములు, భవనాలు, కార్పొరేషన్ల ఆదాయాలు తాకట్టు పెట్టి మరీ వేల రూ. కోట్లు అప్పులు తెస్తున్నారు. బిల్లులు చకచకా చెల్లించేస్తున్నారు. ఇప్పటికే సచివాలయాన్ని తాకట్టు పెట్టి రూ. 370 కోట్లు అప్పు తెచ్చిన సంగతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 05 , 2024 | 11:28 AM