ఏపీసీసీ చీఫ్ పదవికి రుద్రరాజు రాజీనామా
ABN, Publish Date - Jan 16 , 2024 | 11:28 AM
అమరావతి: ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ చీఫ్ ఖార్గేకు అందజేశారు. తన రాజీనామాకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.
అమరావతి: ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ చీఫ్ ఖార్గేకు అందజేశారు. తన రాజీనామాకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. పార్టీలోకి షర్మిలను ఆహ్వానించిన గిడుగు.. అవసరమైతే ఆమె కోసం పదవి వదులుకుంటానని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా ఆమెకు బాధ్యతలు అప్పగించే విషయంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీసీసీ అద్యక్షురాలిగా షర్మిల పేరును ప్రకటించే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 16 , 2024 | 11:28 AM