ప్రియాంక గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Mar 19 , 2024 | 10:27 AM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం.. నేరుగా యమున బ్లాక్‌లోని తన నివాసానికి వెళ్లి విడిది చేశారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సీఎం.. నేరుగా యమున బ్లాక్‌లోని తన నివాసానికి వెళ్లి విడిది చేశారు. సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి ప్రియాంక నివాసానికి వెళ్లి కలిసారు. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి కూడా హాజరుకానున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 19 , 2024 | 10:27 AM