నా దీక్షకు రక్షణ కల్పించాలి: కోడికత్తి శ్రీను

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:24 PM

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు దీక్షకు దిగారు. విశాఖ కేంద్ర కారాగారంలో దీక్ష చేపట్టిన శ్రీనివాసరావును దళిత సంఘాల నాయకులు ములాఖత్ ద్వారా నిన్న కలిసారు.

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు దీక్షకు దిగారు. విశాఖ కేంద్ర కారాగారంలో దీక్ష చేపట్టిన శ్రీనివాసరావును దళిత సంఘాల నాయకులు ములాఖత్ ద్వారా నిన్న కలిసారు. జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చేంతవరకు జైల్లో శ్రీను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. అయితే తన దీక్షకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అంతరాయం కలకుండా చూడాలని, జైలు అధికారులు ఏ క్షణమైనా తన దీక్షను భగ్నం చేసే అవికాశం ఉన్నందున రక్షణ కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని శ్రీను తమను కోరినట్లు విశాఖ దళిత సంఘాల ఐక్య వేదక రాష్ట్ర సమన్వయ కర్త వెంకటరమణ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 19 , 2024 | 12:24 PM