అమరావతి: ఇరకాటంలో వైసీపీ

ABN, Publish Date - Jan 11 , 2024 | 10:23 AM

అమరావతి: మార్పులు, చేర్పులు వైసీపీని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. టిక్కెట్ రాని నేతలంతా పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరైతే అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అలకబూనుతున్న పరిస్థితి. మరికొందరు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసారు.

అమరావతి: మార్పులు, చేర్పులు వైసీపీని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. టిక్కెట్ రాని నేతలంతా పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరైతే అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అలకబూనుతున్న పరిస్థితి. మరికొందరు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. అధినేత వైఖరితో మనస్తాపం చెందిన పలువురు కూడా ఇదే బాటలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో కొత్త ఇన్చార్జుల మూడో జాబితా ప్రకటన వాయిదా వేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 11 , 2024 | 10:24 AM