మొక్కజొన్న తోటలో పులి..

ABN, Publish Date - Dec 29 , 2024 | 01:48 PM

నల్లబెల్లి(Nallabelli) మండలం రుద్రగూడెంలోని ఒర్రి నర్సయ్యపల్లి(Orri Narsayyapalli)లో మరోసారి పెద్దపులి(Tiger) సంచారం కలకలం రేపుతోంది. మొక్కజొన్న చేనులో మహిళా కూలీకి పులి కనిపించింది.

వరంగల్: నల్లబెల్లి (Nallabelli) మండలం రుద్రగూడెంలోని ఒర్రి నర్సయ్యపల్లి (Orri Narsayyapalli)లో మరోసారి పెద్దపులి (Tiger) సంచారం కలకలం రేపుతోంది. మొక్కజొన్న చేనులో మహిళా కూలీకి పులి కనిపించింది. దీంతో స్థానిక రైతులంతా భయంతో కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. భయాందోళనలకు గురైన ఒర్రి నర్సయ్యపల్లి గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. పులి కోసం గాలింపు చేపట్టారు. గ్రామస్థులు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి వెళ్లకూడదని పోలీసులు సూచించారు. రైతులు సైతం పనులు నిమిత్తం పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పులి సంచారంతో ఒర్సి నర్సయ్యపల్లి గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకుని, తమ ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు. కాగా, రెండ్రోజులుగా పెద్దపులి సంచారం వరంగల్ జిల్లా వాసులను వణికిస్తోంది.

Updated at - Dec 29 , 2024 | 01:49 PM