విచారణకు జగన్ బంధువులు డుమ్మా

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:50 PM

Andhrapradesh: వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గతంలో వివేకా కూతురు, అల్లుడు సునీత, రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణను పోలీసులు పున:ప్రారంభించారు. పులివెందుల డీఎస్పీ ఎదుట ఆరుగురు సాక్షులు హాజరయ్యారు.

కడప, డిసెంబర్ 7: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Viveka Case) మర్డర్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు . పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan reddy) బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గతంలో వివేకా కూతురు, అల్లుడు సునీత, రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదు చేశారు.

ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా..


దానికి సంబంధించి విచారణను పోలీసులు పున:ప్రారంభించారు. పులివెందుల డీఎస్పీ ఎదుట ఆరుగురు సాక్షులు హాజరయ్యారు. ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజేష్ కుమార్ రెడ్డి, భరత్ యాదవ్, వీఆర్వో మహేశ్వరరెడ్డిలు హాజరయ్యారు. విచారణకు రావాలని వీరందరికీ ఇప్పటికే పులివెందుల డీఎస్పీ మురళినాయక్ నోటీసులు జారీ చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే జగన్ రెడ్డి సొంత బంధువులు వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు.


ఇవి కూడా చదవండి..

Flights: గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానాలు..

బోరుగడ్డకి మరో దెబ్బ ఇక జైల్లోనే..

Read Latest AP News And Telugu News

Updated at - Dec 07 , 2024 | 04:50 PM