ప్రజాగళం సభలో పోలీసుల అత్యుత్సాహం..

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:21 PM

చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ సీఎం జగన్ జేబు సంస్థగా మారిపోయిందని.. ఏకంగా ప్రధాని మోదీ ఎదురుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ సీఎం జగన్ జేబు సంస్థగా మారిపోయిందని.. ఏకంగా ప్రధాని మోదీ ఎదురుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ పాల్గొన్న సభలో పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇదే విషయంపై బీజేపీ నేతలు మోదీకి ఫిర్యాదు కూడా చేశారు. అటు ప్రధాని కూడా సభలో పోలీసులు కనిపించలేదని స్వయంగా ప్రస్తవించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 18 , 2024 | 12:25 PM