శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:19 PM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాముల కలకలం రేగింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరి మహిళల వద్ద పాములు దొరికాయి.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాముల కలకలం రేగింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరి మహిళల వద్ద పాములు దొరికాయి. ఈ విషపూరిత పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా మహిళల బ్యాగులు చెక్ చేయగా.. విష సర్పాలు కనిపించాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎప్పుడూ బంగారం, విలువైన వస్తువులు, డ్రగ్స్ లభ్యమవుతూ ఉండగా.. మెుదటిసారి పాముల కనిపించడంతో అధికారులు సైతం ఖంగు తిన్నారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సర్పాలను ఎక్కడ్నుంచి తెస్తున్నారు?, వాటిని విక్రయిస్తున్నారా?, ఎందుకు తెస్తున్నారు? వంటి పలు కోణాల్లో అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. కాగా, తనిఖీల్లో పాములను చూసిన తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటివరకూ వారి పక్కనే కూర్చు్న్నా్మంటూ నోరెళ్ల బెట్టారు.
Updated at - Nov 25 , 2024 | 02:19 PM