ఖమ్మం ప్రజలను మరోసారి భయపెట్టిన మున్నేరు..
ABN, Publish Date - Sep 08 , 2024 | 02:28 PM
మున్నేరు(Munneru) ముంపు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజులపాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులు తమ ఇళ్లకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఖమ్మం: మున్నేరు(Munneru) ముంపు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజులపాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులు తమ ఇళ్లకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరద ధాటికి కొట్టుకుపోయిన ఇళ్లను చూసి రోదిస్తున్నారు. వరద పెరగడంతో ముంపు బాధితులను నిన్న(శనివారం) రాత్రి మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడి వీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated at - Sep 08 , 2024 | 02:28 PM