Robbery: సినిమా స్టైల్‌లో హైవేపై భారీ దోపిడీ..!

ABN, Publish Date - May 25 , 2024 | 09:49 PM

ట్రైన్ కిటికిలో నుంచి చైన్లు, సెల్‌ఫోన్లు లాగడం, పార్క్ చేసిన కార్లలో నగదు దోచుకెళ్లడం వంటివి నిత్యం చూస్తు ఉంటాం. కానీ కదులుతున్న ట్రక్ నుంచి సామాన్లను దొంగిలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో చోటుచేసుకుంది.

ట్రైన్ కిటికిలో నుంచి చైన్లు, సెల్‌ఫోన్లు లాగడం, పార్క్ చేసిన కార్లలో నగదు దోచుకెళ్లడం వంటివి నిత్యం చూస్తు ఉంటాం. కానీ కదులుతున్న ట్రక్ నుంచి సామాన్లను దొంగిలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఆగ్రా ముంబై నేషనల్ హైవేపై వెళ్తున్న ట్రక్‌పై నుంచి ఇద్దరు వ్యక్తులు మూటను తొలుత రహదారిపై జారవేయటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే బైక్‌పై ఓ వ్యక్తి రాగా వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచి ప్రమాదకరంగా బైక్‌పై దిగడం గగుర్పాటుకు గురి చేస్తోంది. అటుగా కార్లో వెళ్తున్న వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రియల్ ధూమ్ సీన్లంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియోని క్లిక్ చేయండి.

Updated at - May 26 , 2024 | 08:12 PM