వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి హాట్ కామెంట్స్

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:16 PM

అనంతపురం జిల్లా: శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. తమ ఎస్సీ నియోజకవర్గంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి మంచినీళ్లు అవసరం లేదా? అని అధికారులు, నాయకులను ప్రశ్నించారు.

అనంతపురం జిల్లా: శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. తమ ఎస్సీ నియోజకవర్గంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి మంచినీళ్లు అవసరం లేదా? అని అధికారులు, నాయకులను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేస్ బుక్ లైవ్‌లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే.. కుప్పం తీసుకువెళుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఎన్నికలో ప్రజల వద్దకు వెళ్లి ఎలా ఓట్లు అడగాలంటూ ఆమె నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 08 , 2024 | 12:16 PM