ATPS చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మన్నవ
ABN, Publish Date - Nov 30 , 2024 | 09:57 PM
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మన్నవ మోహన్ కృష్ణ సమర్థతను సీఎం చంద్రబాబు గుర్తించి.. కీలక పదవి అప్పగించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మన్నవ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ చైర్మన్‌గా మన్నవ మోహన్ కృష్ణ శనివారం గుంటూరులో బాధ్యతలు చేపట్టారు.

గత పదేళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి ఆయన అందించిన సేవలను ఈ సందర్బంగా ప్రశంసించారు. తనకు కీలక పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 30 , 2024 | 09:57 PM