కేటీఆర్ సంచలన ట్వీట్

ABN, Publish Date - Nov 08 , 2024 | 01:58 PM

తన అరెస్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవ్విల్లూరుతున్నారని కేటీఆర్ రియాక్టు అయ్యారు. ఇదే విషయంలో ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యంగ్యంగా శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా మారిపోయింది. కేటీఆర్ అరెస్టు అవుతారనే ప్రచారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. విచారణ పూర్తయ్యాకే చర్యలు చేపడతామని.. విచారణ లేకుండా చర్యలు చేపట్టబోమంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో సింపతి డ్రామాలకు అవకాశం ఇవ్వబోమంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక విచారణ నివేదికను అసెంబ్లీ ముందుంచేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.


ఇదిలా ఉండగా తన అరెస్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవ్విల్లూరుతున్నారని కేటీఆర్ రియాక్టు అయ్యారు. ఇదే విషయంలో ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యంగ్యంగా శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. తన మలేషియా టూర్‌ను క్యాన్సిల్ చేసుకుని, హైదరాబాద్‌లోనే ఉన్నానని మీ ఏజెన్సీలు వచ్చి కలవచ్చుని.. చాయ్ బిస్కట్లతో రెడీగా ఉన్నానంటూ కేటీఆర్ సెటైర్ వేశారు.

Updated at - Nov 08 , 2024 | 01:58 PM