అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ జీవిత చరిత్ర ఇదే..
ABN, Publish Date - Nov 06 , 2024 | 09:58 PM
అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ హోరాహోరీగా తలపడ్డా చివరికి ట్రంప్‌నే విజయం వరించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌నకు వివాదాలు చుట్టుముట్టినా, తుపాకులతో దాడులు చేసినా అదరకుండా, బెదరకుండా ఆయన బరిలో దూసుకుపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ హోరాహోరీగా తలపడ్డా చివరికి ట్రంప్‌నే విజయం వరించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌నకు వివాదాలు చుట్టుముట్టినా, తుపాకులతో దాడులు చేసినా అదరకుండా, బెదరకుండా ఆయన బరిలో దూసుకుపోయారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేశారు. డోనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. ఐదుగురు తోబుట్టువుల్లో నాలుగో వ్యక్తి ట్రంప్. న్యూయార్క్ శివారు ప్రాంతాల్లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. తండ్రినే ఆదర్శంగా తీసుకుని 1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు. చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. మన్‌హటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. కాసినోలు, గోల్ఫో కోర్సులు, హోటళ్లు, టవర్స్ నిర్మిస్తూ పోయారు. లాస్ వేగాస్ నుంచి ముంబై వరకూ వ్యాపారం విస్తరించారు.
Updated at - Nov 06 , 2024 | 10:00 PM