కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి: పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Jan 10 , 2024 | 12:07 PM

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తప్పు చేయనట్లయితే విచారణకు స్వాగతించాలని అన్నారు.

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తప్పు చేయనట్లయితే విచారణకు స్వాగతించాలన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను కేంద్రం కాపాడుతోందని మంత్రి ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు బినామీ అని విమర్శించారు. బండి సంజయ్ డ్రామా ఆర్టిస్టు అని.. ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Updated at - Jan 10 , 2024 | 12:07 PM