కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కు..: పీకే

ABN, Publish Date - Mar 04 , 2024 | 08:46 AM

అమరావతి: ఏపీలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీఎం జగన్ భారీ పరాజయాన్ని ఎదుర్కొబోతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు.

అమరావతి: ఏపీలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీఎం జగన్ భారీ పరాజయాన్ని ఎదుర్కొబోతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు. జగన్ రాజకీయ భవిష్యత్ క్షీణ దశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కు పట్టబోతోందని, తెలుగేదేశం పార్టీ విజయం ఖాయమని పీకే తెలిపారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారని, దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని, మామూలు ఓటమికాదని, భారీ పరాజయం తప్పదని తేల్చిచెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 04 , 2024 | 08:46 AM