America Elections: మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ..
ABN, Publish Date - Nov 05 , 2024 | 09:59 PM
ఈసారి అమెరికా(America) అధ్యక్ష పీఠం ఎవరు దక్కించుకుంటారోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో అమెరికా తదుపరి అధ్యక్షుడు (America president) ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి అమెరికా (America) అధ్యక్ష పీఠం ఎవరు దక్కించుకుంటారోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో అమెరికా తదుపరి అధ్యక్షుడు (America president) ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడనుంది. ఎన్నికలు నువ్వా, నేనా అన్నట్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మరోవైపు అమెరికాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే తొలి ఫలితం వచ్చింది. న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రం డిక్స్‌విల్లే నాచ్‌లో మెుత్తం ఆరు ఓట్లలో కమలాకు 3, ట్రంప్‌నకు 3 ఓట్లు వచ్చాయి. 2020లో డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు జో బైడన్ వైపు మెుగ్గు చూపగా.. ఈసారి చెరో మూడు ఓట్లు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated at - Nov 05 , 2024 | 09:59 PM