అల్లు అర్జున్ అరెస్టు.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్టు..
ABN, Publish Date - Dec 13 , 2024 | 10:02 PM
సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు రూ.50 వేల పూచికత్తుపై అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న, మొన్నటి వరకూ బన్నీతో 'పుష్ప-2' సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న నేడు జరిగిన తతంగాన్ని చూసి చలించిపోయారు. "నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నా.. జరిగిన సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరమైన సంఘటన. అయితే, అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది" అంటూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Updated at - Dec 13 , 2024 | 10:04 PM