Video: ఏందయ్యా సీఐ.. ఏంటీ పని..

ABN, First Publish Date - 2024-11-07T13:36:58+05:30 IST

Andhrapradesh: సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వెళ్లి మరీ సీఐ దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయవాడ, నవంబర్ 7: సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమ గోడను కూలగొట్టారంటూ ఎస్‌ఎల్వీ యజమాని ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న దేవినేని శ్రీహరిపై గుణదలలో కేసు నమోదు చేశారు.


ఆ తరువాత సీఐ శ్రీనివాస్ ఏకంగా దేవినేని శ్రీహరి ఇంటికి వెళ్లి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత కక్షతోనే సీఐ దాడికి పాల్పడ్డారని, రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించారని దేవినేని శ్రీహరి ఆరోపిస్తున్నారు. సివిల్ వివాదంలో సీఐ తలదూర్చడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ సీపీ కాంతీరాణాకు నమ్మిన బంటుగా వ్యవహరించారని సీఐ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి...

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..

Read Latest AP News And Telugu News

Updated at - 2024-11-07T15:29:30+05:30