మారాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు: దళపతి విజయ్..

ABN, Publish Date - Oct 28 , 2024 | 10:05 PM

రాజకీయ వర్గాలు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న తమిళగ వెట్రి కళగం(TVK) మెుదటి బహిరంగ సభను తమిళ సినీ హీరో దళపతి విజయ్ అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసి సిద్ధాంతాలను వివరించారు.

ఇంటర్నెట్ డెస్క్: రాజకీయ వర్గాలు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) మెుదటి బహిరంగ సభను తమిళ సినీ హీరో దళపతి విజయ్ అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసి సిద్ధాంతాలను వివరించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహాలు విడమరిచి విజయ్ చెప్పారు. తన ప్రధాన శత్రువు అధికార డీఎంకే అని, రాజకీయాల్లో తాను చిన్న పిల్లాడినే అని ఆయన అన్నారు. కానీ పామును చిన్నపిల్లలు చేతులతో పట్టుకుంటారని విజయ్ చెప్పారు. రాజకీయం అనే పామంటే తనకు భయం లేదని, రాజకీయం అంటే సినిమా కాదని.. రణరంగం అని ఆయన గర్జించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌ని కూడా మెుదట ఆర్టిస్టు అని తేలిగ్గా మాట్లాడారని, ఎన్నికల ఫలితాల తర్వాత వారికి విషయం అర్థమైందని గుర్తు చేశారు. మారాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదని, రాజకీయాలు కూడా మారాలని దళపతి విజయ్ అన్నారు.

Updated at - Oct 28 , 2024 | 10:06 PM