ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల భేటీ

ABN, Publish Date - Mar 08 , 2024 | 11:35 AM

న్యూఢిల్లీ: తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సమావేశం ముగిసింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సమావేశం ముగిసింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. దాదాపు 20 నిముషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లను సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి అందించారు. తొలివిడతలో దాదాపు 150 నుంచి 200 సీట్ల మధ్య అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కనీసం 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 10 , 2024 | 01:17 PM