బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
ABN, Publish Date - Dec 12 , 2024 | 10:17 PM
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేశ్‌తోపాటు లగచర్ల రైతులనూ పోలీసులు అరెస్ట్ చేశారు.
వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేశ్‌తోపాటు లగచర్ల రైతులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో హీర్యానాయక్ అనే రైతు ఒకరు. ఈ రైతు ప్రస్తుతం కంది సెంట్రల్ జైలులో ఉన్నాడు. అయితే బుధవారం రాత్రి హీర్యాకు ఛాతిలో నొప్పి రావడంతో అతడిని జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గురువారం మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో హీర్యా నాయక్ చేతికి బేడీలు ఉన్నాయి. బేడీలతోనే రైతును పోలీసులు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతేకాకుండా బేడీలతోనే రైతుకు చికిత్స అందజేశారు. ఇప్పుడు ఇది రచ్చకు దారి తీసింది. రైతును బేడీలతో ఎలా తీసుకువస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బేడీల అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Updated at - Dec 12 , 2024 | 10:18 PM