జగన్ ప్రసంగంతో అవాక్కైన ఎమ్మిగనూరు ప్రజలు

ABN, Publish Date - Apr 01 , 2024 | 06:48 AM

కర్నూలు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేదలు అనే పదానికి అర్థం మార్చేసారు. చంద్రబాబులా తనకు డబ్బులు, పత్రికలు, టీవీ చానల్స్ లేవంటూ చెప్పుకొస్తున్న ఆయన తాజాగా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా పేదల ఖాతాలో వేసేశారు.

కర్నూలు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేదలు అనే పదానికి అర్థం మార్చేసారు. చంద్రబాబులా తనకు డబ్బులు, పత్రికలు, టీవీ చానల్స్ లేవంటూ చెప్పుకొస్తున్న ఆయన తాజాగా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా పేదల ఖాతాలో వేసేశారు. ఇది పేదవారికి, ధనవంతులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చెబుతున్న జగన్.. తాను ప్రకటించిన అభ్యర్థులంతా పేదవారని చెప్పుకు రావడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అవినీతి అక్రమాలతో వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్న ఎమ్మెల్యేలు పేదలు ఎలా అవుతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 01 , 2024 | 06:48 AM