Video Viral: పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ABN, Publish Date - Jun 17 , 2024 | 01:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ పనులు ఏం జరిగాయి.. ఎంత మేర జరిగాయి అనే అంశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను సోమవారం సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ పనులు ఏం జరిగాయి.. ఎంత మేర జరిగాయి అనే అంశాలను ఈ సందర్బంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫొటోలను ఆయన నిశీతంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన తొలి పర్యటనలో భాగంగా పొలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు.


2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో.. పోలవరం నిర్మాణ పనులు చేపట్టారు. ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌పై ఆయన సమీక్ష నిర్వహించే వారు. అలాగే ప్రాజెక్ట్‌ను సైతం ఆయన సందర్శించే వారు. దీంతో సోమవారాన్ని ఆయన ప్రభుత్వం పోలవారంగా మార్చింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.


అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు.. కూటమికి పట్టం కట్టారు. దీంతో ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. ఆ క్రమంలో ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. అందులోభాగంగా.. సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Updated at - Jun 17 , 2024 | 01:42 PM