పట్టుబడ్డ వైసీపీ ఎన్నికల ప్రచారసామాగ్రి..

ABN, Publish Date - Apr 03 , 2024 | 08:19 AM

కాకినాడ: పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మీ ఈవీఎంలు కలకలంరేపాయి. తనిఖీల్లో భాగంగా పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న బొలెరో వాహనాన్ని ఫ్లయింగ్ స్వ్కాడ్ పట్టుకుంది. అందులో వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి భారీగా పట్టుబడింది.

కాకినాడ: పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మీ ఈవీఎంలు కలకలంరేపాయి. తనిఖీల్లో భాగంగా పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న బొలెరో వాహనాన్ని ఫ్లయింగ్ స్వ్కాడ్ పట్టుకుంది. అందులో వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి భారీగా పట్టుబడింది. బొలెరోలో డమ్మీ ఈవీఎంలు ఉండడంతో ఎన్నికల అధికారులు షాక్ అయ్యారు. ఇంకా జగన్ మాస్కులు, టోపీలు, జెండాలు కూడా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎత్తుగడలు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 03 , 2024 | 08:19 AM