BRS: భక్తుల ఆగ్రహం.. అడ్డంగా బుక్కైన కౌశిక్ రెడ్డి
ABN, Publish Date - Oct 20 , 2024 | 09:38 PM
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఇటీవలే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఇటీవలే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కౌశిక్ ఆయన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి చర్యలపై నిషేధం ఉంది. ప్రజాప్రతినిధి అయ్యిండి ఆలయ నిబంధనలను అతిక్రమించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో...
Updated at - Oct 20 , 2024 | 09:59 PM