పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు..

ABN, Publish Date - Feb 16 , 2024 | 11:18 AM

న్యూఢిల్లీ: ఏప్రిల్, మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజులపాటు నిర్వహించనున్న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.

న్యూఢిల్లీ: ఏప్రిల్, మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజులపాటు నిర్వహించనున్న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో వరుగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్మక్షుడు జెపీ నడ్డా ఇతర ముఖ్యనేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 16 , 2024 | 11:18 AM