అమెరికాలో బ్యాలెట్ బాక్సులకు నిప్పు..
ABN, Publish Date - Oct 29 , 2024 | 09:27 PM
నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US presidential elections) జరగనున్నాయి. అయితే ఇప్పటికే సగం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US presidential elections) జరగనున్నాయి. అయితే ఇప్పటికే సగం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలోని మెుత్తం 50 రాష్ట్రాల్లో 47 రాష్ట్రాలు ఎర్లీ పోలింగ్‌కు అనుమతి ఇచ్చాయి. దీంతో ఓటింగ్‌కు జనం పోటెత్తారు. ఫినిక్స్, వాషింగ్టన్, ఒరెగాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ ప్రాంతాల్లోని బ్యాలెట్ బాక్సులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒరెగాన్‌లోని పోర్ట్ ల్యాండ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు చెలరేగి మూడు బ్యాలెట్ బాక్సులు దెబ్బతిన్నాయి. వాషింగ్టన్‌లోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. ఫినిక్స్‌లో నిప్పుపెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 20 బ్యాలెట్ బాక్సులు ధ్వంసం అయ్యాయి.
Updated at - Oct 29 , 2024 | 09:27 PM