బ్రిటిష్ కాలం నాటి బాడంగి ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ..
ABN, Publish Date - Nov 23 , 2024 | 09:50 PM
విజయనగరం(Vizianagaram) జిల్లా బాడంగి (Badangi)లో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. నేవీకి సంబంధించిన ఈ ఎయిర్ స్ట్రిప్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు.
ఇంటర్నెట్ డెస్క్: విజయనగరం (Vizianagaram) జిల్లా బాడంగి (Badangi)లో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. నేవీకి సంబంధించిన ఈ ఎయిర్ స్ట్రిప్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. అప్పట్లో ఆయుధ కేంద్రంగా ఉన్న బాడంగి విమానాశ్రయం 227ఎకరాల పరిధిలో ఉండేది. తర్వాత అది నిరుపయోగంగా మారింది. అప్పట్లో ఇక్కడుంటే గోడౌన్‌లు ధ్వంసం కాగా, విమానాలు దిగే రన్ వే మాత్రం మిగిలే ఉంది. కాగా, కొంత మాత్రం ఆక్రమణలకు గురైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే రక్షణ రంగానికి విరివిగా ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాల నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. అందుకు తగిన పథక రచన చేశారు.
Updated at - Nov 23 , 2024 | 09:50 PM