టీడీపీ నేత సోమిరెడ్డిపై హత్యాయత్నం

ABN, Publish Date - Feb 27 , 2024 | 10:33 AM

నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నెల్లూరు జిల్లా, మనుగోలు మండలం, కట్టు పల్లిలో వైసీపీ సానుభూతి పరుడు బల్లి వెంకటయ్య గడ్డపారతో సోమిరెడ్డివైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నెల్లూరు జిల్లా, మనుగోలు మండలం, కట్టు పల్లిలో వైసీపీ సానుభూతి పరుడు బల్లి వెంకటయ్య గడ్డపారతో సోమిరెడ్డివైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వెంకటయ్యను అడ్డుకున్నారు. ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిన్న కట్టుపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమిరెడ్డి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 27 , 2024 | 10:33 AM